2022-23 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను ఏక మొత్తంగా చెల్లించే వారికి 5% శాతం రాయితీ శనివారం వరకు వర్తిస్తుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5% శాతం రాయితీ కి ఆఖరి రోజు కావడంతో జీఎంసీ ప్రధాన, బృందావన్ గార్డెన్స్ సర్కిల్ కార్యాలయాల్లో నగదు కౌంటర్లు రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు.