గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణ శివారులో పెన్నానది వంక దగ్గర శనివారం తెల్లవారుజామున ఎద్దుల బండిని లారీ ఢీ కొన్న ప్రమాదంలో పామిడి కి చెందిన చిదంబరం(40) అను రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రెండు ఎద్దులకు తీవ్రమైన గాయాలు కాగా బండి ఛిద్రమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కుటుంబ పెద్ద మరణించడంతో బోరున విలపించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.