అమడగూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభమయిన 9: 38 కొద్ది నిమిషాలలోనే ప్రశ్నాపత్రం వాట్సప్ గ్రూపులో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిత్తించింది.
మొదట ఓబులదేవరచెరువు వైస్సార్సీపీ-3 గ్రూప్ లో అమడగూరు పాఠశాలలో ప్రశ్న పత్రం లీక్ అయినట్లు రావడంతో టీవీ లలో గ్రూపులలో అన్ని చోట్ల చర్చనీయాంశమైంది. దాంతో తహసీల్దార్ రెడ్డి శేఖర్, యస్ఐ ఎన్వీ రమణ లు పరీక్ష కేంద్రాలలో పర్యటించు పరీక్షల నిర్వహణ అధికారులతో చర్చించారు. ఇక్కడ లీక్ కాలేదని చెప్పారు.
దీంతో శ్రీసత్యసాయి జిల్లా విద్యా అధికారి నాగేశ్వరరావు హుటాహుటిన అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ పేపర్ లీకు పై సంబంధిత చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో జరిగిన పేపర్ లీకు పై విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా డిఈఓ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్ష ఇంగ్లీష్ ప్రశ్నపత్రము లీకు పై విచారణ చేపట్టగా గతంలో అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ గా పనిచేసి ప్రస్తుతం నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస రావు అనే వ్యక్తి నుంచి ఓబులదేవరచెరువు వైస్సార్ సీపి-3 వాట్సప్ గ్రూపులో ఇంగ్లీష్ ప్రశ్నపత్రము ఫార్వర్డ్ చేసినట్లు ప్రాథమిక సమాచారం.
పేపర్ లీకు పై శ్రీనివాసరావు కు ఎవరూ ఫార్వార్డ్ చేశారు అనేది తెలియల్సి వుంది. పేపర్ లీక్ కు పాల్పడిన ఎంతటివారినైనా ఉపేక్షించబోమని అన్నారు. శ్రీనివాసరావు ఇంగ్లీష్ ప్రశపత్రము ఎవరికి ఫార్వార్డ్ చేశారో వారు ఇంకా ఎవరికైనా ఫార్వర్డ్ చేశారో సమగ్ర విచారణ చేపడతామన్నారు. ఇప్పటికే శ్రీనివాసరావు పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
శ్రీనివాసరావు ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే నిందుతులు దొరుకుతారని డీ ఈ. ఓ నాగేశ్వరరావు తెలిపారు. అయితే ఇంగ్లీష్ ప్రశ్నపత్రము లీక్ అమడగూరు మండలంలో జరగలేదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రశ్నపత్రము లీకు ఎక్కడా జరిగిందో పోలీసు విచారణలో తేలాల్సి ఉందన్నారు. ప్రశ్నపత్రము లీకులకు పాల్పడిన శ్రీనివాసరావుకు, అతడికి సహకరించిన వారి పై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి శేఖర్, పదో తరగతి పరీక్ష ఛీప్, డిపార్ట్మెంట్ అధికారులు రమణ, కల్యాణి, జంషీర్, శ్రీకాంత్ రెడ్డి పరీక్ష పర్యవేక్షకులు మనోహర్ నాయక్, ఎస్ఐ రమణ, ఆర్ఐ ఈశ్వరయ్య, ఇన్వీజిలేటర్ లు తదితరులు పాల్గొన్నారు.