భూ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ అలెగ్జాండర్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐలు కీర్తి, ఆనంద్ బాబు ఆచారితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సమగ్ర భూ రీ సర్వేకు సం బంధించిన పీఓఎస్ఆర్ పనులను వేగంగా పూర్తి చేయాలని వీఆర్డీలు, రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు పది రోజుల్లోగా ల్యాండ్ ప్యూరిఫికేషన్ కు సంబంధించి క్షేత్రస్థాయి ఆరు దశల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ సుంకన్న, మండలంలోని వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.