రాజాం నియోజకవర్గం లోని కంచరాం గ్రామంలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనపై బొబ్బిలి డి ఎస్ పి బి. మోహన్ రావు శుక్రవారం విచారణ ప్రారంభించారు. కంచరాం గ్రామంలో ని బాధితురాలి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, ఇతర బంధువులతో సంఘటన గురించి మాట్లాడారు. ఘటనపై వారి బంధువులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దోషులు ఎంతవారైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. డీఎస్పీ వెంట రాజాం పట్టణ సిఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.