చేపల కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు చెరువుకుంటలో మునిగి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేటలో శుక్రవారం జరిగింది. ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం.. చేపలు పట్టుకుంటూ జీవనం సాగించే కొన్ని కుటుంబాలు గ్రామ శివారులో నివసిస్తున్నాయి. కుటుంబ సభ్యులు వేటకు వెళ్లిన సమయంలో ఆరేళ్లలోపు వయసున్న అన్నాదమ్ములు ఇద్దరు సమీపంలోని చెరువుకుంట దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ పడి మృతిచెందారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.