బుట్టాయగూడెం మండలం మర్లగూడెంలో బండారు అప్పారావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 కాసుల బంగారం, కిలోన్నర వెండి, కొంత నగదు అపహరణ గురైందని అప్పారావు పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. బయట నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.