ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఘోరం చోటుచేసుకుంది. ఓ మసీదులో బాంబు పేలుడుకు 66 మంది మరణించారు. ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ప్రార్థనల కోసం ఖలీఫా సాహిబ్ మసీదుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.
ప్రార్థనలు జరుగుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. దీంతో మసీదులో ఒక్కసారిగా పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడటం అందర్నీ కలచివేసింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు 66 మంది ప్రాణాలు పోగా 78 మంది తీవ్ర గాయాలయ్యాయి.