బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ రియాలిటీ షో అనేది అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ షో వల్ల యువత పెడదారి పడుతున్నారంటూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. మంచి పిల్ వేశారంటూ పిటిషనర్‌ను ఏపీ హైకోర్టు ప్రశంసలు గుప్పించింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం తెలియజేసింది.
బిగ్‌బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019వ సంవత్సరంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణకు నోచుకోలేదు. నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరడంతో న్యాయస్థానం స్పందించింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది.