వేసవిలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వాటర్, నిమ్మరసం, సగ్గుబియ్యం ఉడికించిన నీరు, ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ పంచదార కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నీరు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్ ధరించండి. దీనివల్ల మనకు వేడిగా అనిపించదు. పుచ్చకాయలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను తింటే శరీరానికి చాలా విటమిన్లు అందుతాయి. కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు చాలా మేలు.
ఆహారంలో నూనె వాడకాన్ని కొంచెం తగ్గించండి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం పూట నూనెతో కూడిన వంటకాలు కాకుండా, ఆవిరితో ఉడికించిన కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లండి.