క్రొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ఒకటైన పల్నాడు జిల్లా పోలీస్ విభాగం అక్రమాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఉంది అని చెప్పుకోవచ్చు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగిన ఉపేక్షించేది లేదు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో అక్రమ మద్యం రవాణా, మాదక ద్రవ్యాల రవాణా అరికట్టే విధంగా చెక్ పోస్ట్ ల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్న పల్నాడు జిల్లా పోలీసులు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ చెక్ పొస్ట్ వద్ద చేపడుతున్న తనిఖీలలో భాగంగా కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న 288 మద్యం బాటిళ్లను (90ml) మరియు కారును (Tata vista) సీజ్ చేయడం జరిగినది. అలానే జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారు చేస్తున్న స్థావరాలపై ముమ్మర దాడులు జరిపి దాదాపుగా 10,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగినది.