అప్పు ఇచ్చిన వారితో సంబంధం పెట్టుకోవాలని ఓ భర్త తన భార్యను వేధించిన ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. రాజస్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలోని సదర్కు చెందిన వ్యక్తికి ఫిబ్రవరిలో పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే అత్తారింట్లో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. తాగుబోతు భర్త తన భార్యను వరకట్నం తీసుకురావాలని వేధించసాగాడు.
మద్యానికి బానిసైన భర్త గ్రామంలో రూ.5 లక్షలపైనే అప్పులు చేశాడు. అప్పులు తీర్చే వారు ఇంటిపై పడి చాలా అవమానాలు చేశారు. దీంతో అప్పు ఇచ్చిన వారికి అత్తింటివారు ఆ మహిళను అప్పగించాలని చూశారు. వారికి ఆమె సహకరించకపోవడం వల్ల భర్త ఆమెపై ఆగ్రహించి రోజూ కొట్టడం మొదలుపెట్టాడు. భర్త చిత్రహింసలను భరించలేని ఆ మహిళ బుధవారం సదర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.