రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ షరీఫ్ నియమితులయ్యారు. బెల్లంకొండ గ్రామానికి చెందిన మస్తాన్ షరీఫ్ ఆ గ్రామ సర్పంచ్ గా, మండల అధ్యక్షులుగా గతంలో పని చేశారు.
ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కి ధన్యవాదాలు తెలిపారు. షరీఫ్ కి రాష్ట్ర కమిటీ లో పదవి ఇవ్వడం తో బెల్లంకొండ మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.