ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన వల్లే తనకు మంత్రి పదవి: ఆదిమూలపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 08:40 AM

తనకు రెండోసారి మంత్రి పదవి రావడంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర ఉందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని మంత్రి కోసం రెండు అడుగులు వెనక్కి వేశారన్నారు. దీంతో తనకు మంత్రి పదవి దక్కిందని చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శనివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తనకు కేటాయించిన శాఖ వల్ల తన నియోజకవర్గానికి ఎంత మేలు చేకూరుతుందో తనకు కూడా తెలియదన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌కు తాను తెలిపానన్నారు. పురపాలక, పట్టణశాఖ మంత్రిగా తన బాధ్యతలను నిజాయతీగా నిర్వహిస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com