రంజాన్ పర్వదినం సందర్భంగా మే 3న పదో తరగతి పరీక్షకు విరామం ఉంది. మే 2నే రంజాన్ ఉండొచ్చు అనే భావాన్ని పలువురు ముస్లిం సోదరులు నాతో తెలిపారు అని జనసేన నెల్లూరు ఇంచార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒకవేళ పండుగ 2న జరిగితే విరామ రోజుని 2కి మార్పుచేసి మే3న పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులూ, మరియు పలువురు ముస్లిం పెద్దలు సమావేశమయ్యారు. రంజాన్ రోజున ప్రజలకి పండుగ జరుపుకోవడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేసుకుంటాం అని, అలానే సెలవు విషయం పలువు మంత్రుల దృష్టికి తీసుకువెళతాం అని ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారు.