బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి పుణ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా క్షేత్రంలో కొలువుతీరిన ఉమామహేశ్వర స్వామి వార్లను విశేష సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. అలాగే క్షేత్రంలోని కోనేరు లో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా క్షేత్ర పరిధిలోని వివిధ సందర్శనా ప్రదేశాలను వీక్షించారు. విచ్చేసిన భక్తులకు యాగంటి పరిధిలోని పలు అన్నదాన సత్రాల్లో భోజన వసతి కల్పించారు.