ఏపీ ఆర్టీసి ఉద్యోగులకు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిలాల్లో మొత్తంగా ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైక్‌లను అందించేందుకు సిద్ధమైంది. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బస్‌స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్య్కూలర్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa