జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు ఒక నెల గౌరవ వేతనాన్ని వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మే 1వ తేదీన గౌరవ వేతనాన్ని వాలంటీర్ల బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే నేటికీ పలు గ్రామ సచివాలయాలు, మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు మరో నెలకు సంబంధించిన గౌరవ వేతనం అందాల్సి ఉంది. బిల్లుల జాప్యం కారణంగా ఒక నెలకు సంబంధించిన గౌరవ వేతనాలు ఆలస్యం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. బిల్లుల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో తమకు గౌరవ వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు.