సజావుగా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని ఆర్డీఓ జి. రామకృష్ణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదోని పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించ కూడదని సిబ్బందికి ఆర్డీవో సూచించారు. ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వరాదని స్పష్టం చేశారు.