రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏపీలో హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. నూజివీడు మండలానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ బాలిక పై అత్యాచారయత్నం చేశాడు. బాలిక అరవడంతో నిందితుడు పరారయ్యాడు.
నూజివీడు మండలంలో ఇంటర్ చదువుతున్న బాలికకు, బెంగుళూరుకు చెందిన అంజనేయులు అనే వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆంజనేయులును కలిసేందుకు బాలిక విజయవాడ వచ్చింది. హోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో చుట్టు పక్కల వారు గమనించి ఆమెను కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సింగ్నగర్కి చెందిన ఆటో డ్రైవర్గా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.