ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలం, బంటుపల్లె గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదంతో పొలంలోని మామిడి చెట్లు నరికి వేయబడ్డాయి. ఇందుకు సంబంధించి బాధిత రైతు రామాంజనేయులు గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంటుపల్లెకు చెందిన రామాంజనేయులు గౌడు, వీరాంజనేయులు గౌడు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి వారి తల్లిదండ్రుల ఆస్తి 702 సర్వే నెంబర్ లోని పొలాన్ని ఇరువురికి పంచి ఇచ్చారు. అయితే రామాంజనేయలు గౌడ్ పొలం నాణ్యతగా లేకపోవడంతో అతనికి ఒకటిన్నర ఎకరాల చొప్పున ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని తమ్ముడు వీరాంజనేయులు గౌడ్ ఇటీవల రామాంజనేయులుగౌడ్ తన పొలంలో బోరు వేయించేందుకు ప్రయత్నించగా ఎలా వేస్తారో చూస్తా అని బెదిరించాడు. ఈ క్రమంలోనే అన్న పొలంలో ఉన్న 8 మామిడి చెట్లను నరికి వేశాడు. ఈ మేరకు బాధితుడు రామాంజనేయులు గౌడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు.