రాయదుర్గం పట్టణంలోని 30వ వార్డు సిద్దేశ్వర కాలనీకి వెళ్లేదారిలో మున్సిపాలిటీ తాగునీటి పైపు లైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. గత కొద్ది రోజులుగా పైపు లైన్ పగిలి డ్రైనేజీ కాలవలో పోతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. పట్టణంలో కొన్నిప్రాంతాల్లో తీవ్రతాగునీటి సమస్యతో సతమతమవుతుంటే ఇక్కడ మాత్రం నీరు వృథా అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని కోరారు