అర్థరాత్రి రాయదుర్గం పట్టణంలో పశువుల దొంగలు హాల్చల్ చేశారు. స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 2గంటలకు దబ్బడికాంప్లెక్స్ వద్ద ముసుగు ధరించిన దుండగులు బొలెరోలో వచ్చి ఇళ్లవద్దకు రావడంతో ఓయువకుడు ప్రశ్నించారు. సీసాలతో దాడిచేయగా తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బొలెరో వాహనాన్ని వెంబడించారు. బళ్లారి రోడ్డు కుంటిమారెమ్మ గుడి సమీపాన బొలెరో వదిలేసి పరారయ్యారు. పందులదొంగతనానికే వచ్చినట్లు పోలీసులు బావిస్తున్నారు.