తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మ కంగా తీసుకొని ధర్మవరం నియోజవర్గం మొదటి స్థానంలో ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు.
ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాలశ్రీ రామ్ అదేశాలననుసరించి పట్టణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధర్మవరం మునిసిపల్ పరిధిలో గల 40 వార్డులలో గల వార్డు కమిటీ అధ్యక్షులు, వార్డు ముఖ్యనాయ కులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు ధర్మవరం పట్టణంలో ఉన్న నలభై వార్డులలో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు పక్రియ చేపట్టాలని వార్డు కమిటీ సభ్యులకు తెదేపా నాయకులు దిశానిర్దేశం చేశారు.
ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి వార్డుకు ఒక ఐటీడీపీ సభ్యుడు సభ్యత్వ నమోదుకు అందుబాటులో ఉంటాడని సభ్యత్వం తీసుకోవాలనుకొన్న వారు ఐటీడీపీ సభ్యునికి వంద రూపాయలు చెల్లిస్తే అందుకు జతగా తెలుగుదేశంపార్టీ నిధి నుండి మరో ఆరు వందల రూపాయలు కలిపి మొత్తము ఏడు వందల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించడం జరుగుతుందన్నారు.
సభ్యత్వం కార్డు తీసుకొన్న ప్రతి ఒక్కరికి రెండు సంవత్సరాలు ప్రమాద భీమా అమలులో ఉంటుందన్నారు. కావున వార్డు కమిటీ సభ్యులు, వార్డులలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరూ నలభై వార్డులో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తెలుగుదేశంపార్టీ సభ్యత్వం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేసి ధర్మవరం పట్టణంలో రికార్డ్ స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలని కోరారు.