చిత్రావతి రిజర్వాయర్ లో ముంపుకు గురైన మొదలకుంట గ్రామానికి పరిహారం చెల్లించాలని ఆ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చిత్రావతి రిజర్వాయర్ లో తమ గ్రామం ముంపుకు గురికాగా నాలుగు వందల కుటుంబాలు నష్టపోయాయని, 2009లో తమ గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు నేటికీ పరిహారం అందించలేదని, మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమకు పరిహారం అందలేదని పేర్కొంటూ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.