అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. అయితే దేశంలో ఇంధన డిమాండ్ తక్కువగా ఉండడంతో చమురు కంపెనీలు ధరల పెంపు వైపు వెళ్లడం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పెట్రోలు, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశంలో ఇంధన ధరలకు సంబంధించి చమురు కంపెనీలు సోమవారం తాజా ప్రకటన చేశాయి. అయితే కంపెనీల ప్రకటనలో పెట్రోలు, ధరల పెంపు ప్రస్తావన లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర మళ్లీ పెరిగింది. కొన్ని నగరాల్లో హెచ్చుతగ్గులు మినహా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు కంపెనీలు సోమవారం వరుసగా 26వ రోజు ధరలను సవరించలేదు. హైదరాబాద్‌లో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉండగా, డీజిల్ ధర రూ.105.49గా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.119.00, డీజిల్ ధర రూ.105.02గా ఉంది. విజయవాడలో ఈరోజు పెట్రోల్ ధర 21 పైసలు తగ్గి లీటరుకు రూ.121.29కి చేరుకుంది. డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.106.90కి చేరుకుంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.120.81, డీజిల్ ధర రూ.106.40గా ఉంది.