రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి హోంమంత్రి తానేటి వనిత స్వయంగా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి సోమవారం మధ్యాహ్నం వస్తున్నారని అధికారిక ప్రకటన వెలువడింది. మరోవైపు మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా రానున్నారు. అలాగే బాధితురాలు తన నియోజకవర్గానికి చెందిన దళితురాలు కావడంతో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం రాబోతున్నారు.