ప్రకాశం జిల్లా గిద్దలూరులో పెరిగిన ఉష్ణోగ్రతల ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నాయబ్ రసూల్ తెలిపారు. గంటకొకసారి క్రమం తప్పకుండా తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుందని చెప్పారు. వడ దెబ్బ తగిలిందని అనుమానం కలిగితే తక్షణమే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించి చికిత్స పొందాలి సూచించారు. కొబ్బరినీళ్లు ఓవార్ఎస్ కూడా శరీర తత్వాన్ని బట్టి శరీర ఉష్ణోగ్రతను నిద్రించేందుకు సేవించడం మంచిదని ప్రజలకు తెలిపారు. మధ్యాహ్నం రాత్రి ఆహారం తర్వాత గ్లాసు మజ్జిగ తాగడం చాలా మంచిదని అన్నారు.