టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. కె. వి. పల్లి మండలం, లక్ష్మీరెడ్డిగారిపల్లిలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ సహ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం దాన ధర్మాలకు, ఆప్యాయతానురాగాలకు ప్రతీకని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లేములందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షురాలు గీతమ్మ, రెడ్డెప్ప రెడ్డి, రవిచంద్రా రెడ్డి, యర్రం రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి(చిన్న), సుధాకర్ నాయుడు, రమణ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేంద్ర రెడ్డి, వెంకటేశ్వర రావు, రెడ్డి శేఖర, ఎరగం రెడ్డి, ఆనంద్, వెంకట రత్నం, ఎంజెవి రమణ, మదన్ మోహన్ రెడ్డి, ధనుంజయ, మోహన్ రెడ్డి, వెంకట రమణ నాయుడు, సురేష్ రెడ్డి, రెడ్డి బాష, టిడిపి నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు, ముస్లిం, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.