శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని లింగంపల్లి లో డ్రైనేజీ లో పూడిక నిండిపోయి మురికినీరు రోడ్లపైకి వస్తుండడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు జెసిబి సహాయంతో పూడికతీత పనులు చేపట్టారు. పట్టణంలోని సప్తగిరి కళాశాల సమీపాన డ్రైనేజీ కాలువల్లో పూడికను తొలగించడంతో ఆ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.