రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఒంగోలులో కెవిపిఎస్, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు బైఠాయించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లింపుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కాదని, మరెవరూ భారం భగ్నం చేయటానికి సాహసించని అంతగా ఆ నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.