గాలి వానకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఓబులవారిపల్లి మండలం సిపిఐ మండల కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఓబులవారిపల్లి మండలో ఆదివారం రాత్రి 10 గంటల సమయములో వాన, గాలి భారీ ఎత్తున రావడంతో మండలంలో అరటి తోటలు, మామిడి కాయలు, తమలపాకుల తోటలు నేలమట్టమయ్యాయి అని అయన అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే రైతుల దగ్గరకు వెళ్లి పొలాలను పరిశీలించి వాళ్లకు ఎకరాకు 50, 000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి వారు ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పిఎస్ ఓబులవారిపల్లె మండలం కార్యదర్శి మోడీ శివయ్య, సిపిఐ నాయకులు పులి శంకరయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.