చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండల పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పులిచర్ల మండలంలోని చిట్టారెడ్డిపేట పెట్రోల్ బంకు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మేఘనాథ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa