ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సముద్రం నీటిని పీల్చిన మేఘాలు

national |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:24 PM

మేఘాలు సముద్రపు నీటిని లాక్కుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. కన్యాకుమారి సమీపంలోని తూత్తూర్‌ లో శనివారం సాయంత్రం నుంచి సముద్రం కల్లోలంగా కనిపించింది. 


ఈ నేపథ్యంలో తీరంలో ఉన్న జాలర్లు తూత్తూర్‌ సముద్రంలో నెలకొంటున్న పరిస్థితులను గమనించారు. శనివారం సా. 6 గంటల నుంచి సుమారు 30 నిముషాల పాటు మేఘాలు సముద్రపు నీటిని పీల్చుతున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa