ఒక్క చాన్స్ అడిగిన జగన్ రెడ్డి..జనం బతికే చాన్స్ లేకుండా అష్టకష్టాలు పెడుతున్నాడు అని టీడీపీ నరసరావుపేట ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక 33వ వార్డు నందు ప్రజా చైతన్య యాత్రలో మాట్లాడుతూ జగన్ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజల పై పన్నులు, చార్జీల మోతతోప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గతంలో అన్న కాంటీన్లు ఉన్నాయ్ ఇప్పుడు ఉన్నాయా?చంద్రన్న బీమా వచ్చేది ఇప్పుడు వస్తుందా?.టీడీపీ ప్రభుత్వం 5 రూపాయలకి అన్నం పెడితే..దాన్ని తీసేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు.ఒక్క ఇల్లు అయిన ఈ మూడేళ్లలో కట్టడా?రాష్ట్రంలో గతి, మతి లేని పాలన నడుస్తుంది అని ఆవేదన వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa