ప్రస్తుత పాలసీ ప్రకారం.. ఏ ఒక్కరికీ బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్పష్టమైన, ఏకపక్ష నిర్ణయంతో వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని సుప్రీం స్టేట్మెంట్ లో పేర్కొంది.వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధనలపై చేపట్టిన విచారణలో ఈ విధంగా స్పష్టం చేసింది.సుప్రీం కోర్టు ఆదేశిస్తూ.. ప్రజలు, డాక్టర్లు వ్యాక్సిన్ వేసే క్రమంలో వారు చెప్పిన రిపోర్టులను ఏ మాత్రం రాజీపడకుండా ప్రచురించాలని చెప్పింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే అంశంపై వేసిన పిటిషన్ మేరకు సుప్రీం ఈవిధమైన తీర్పునిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa