ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ఆఫర్లతో ఫ్లిప్ కార్డ్ మరో సేల్..దేనిపై ఎంత డిస్కౌంటో తెలుసా

national |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 03:47 PM

మరోసారి సెల్ ఆఫర్ ను ఫ్లిక్ కార్డ్ ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో మరో సేల్ మొదలుకానుంది. బిగ్ సేవింగ్ డేస్ పేరిట మే 3 నుంచి 8వ తేదీ వరకు సేల్‌ జరుగనుంది. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు , స్మార్ టీవీలు, ఎయిర్‌ కండీషనర్లలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఏసీలపై , స్మార్ట్ టీవీలపై 75శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తన పేజీలో పేర్కొంది. అలాగే మొబైళ్లపై కూడా మంచి ఆఫర్లు ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ టీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ మెంబర్లకు ఈ సేల్‌ ఒకరోజు ముందుగానే అందుబాటులోకి రానుంది.


ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ లో ఎస్భీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం అదనంగా తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. కాగా, ఈ సేల్‌లో సామ్‌సంగ్‌, షావోమీ, రియల్‌మీ, పోకో, ఇన్ఫినిక్స్, మోటోరోలాతో పాటు మరిన్ని బ్రాండ్ల మొబైళ్లపై ఆఫర్లు ఉండనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. అలాగే షావోమీ, రియల్‌మీ, వన్‌ప్లస్‌ సహా మిగిలిన కంపెనీల స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లు ఉంటాయి. ఎల్‌జీ, సామ్‌సంగ్‌, హిటాచీ, పానసోనిక్ సహా మరిన్ని బ్రాండ్ల ఏసీలపై కూడా భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ పేజీ వెల్లడించింది. అయితే ఇప్పటికి కొన్ని డీల్స్‌ను మాత్రం ఫ్లిప్ కార్డ్ టీజ్ చేసింది. సేల్‌ దగ్గర పడుతున్న కొద్ది క్రమంగా ప్రకటిస్తుంది.


అమోలెడ్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ ఉండే Samsung F22 మొబైల్‌ను రూ.9,999కే ఈ సేల్‌లో సొంతం చేసుకోవచ్చు. బేస్ మోడల్ రూ.10,999కే అందుబాటులో ఉండనుండగా.. SBI క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మరో రూ.1000 ఆదా అవుతుంది.


ఆఫర్లతో కలిపి Poco M4 Pro 5G మొబైల్‌ను రూ.13,999కే దక్కించుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే ఈ మొబైల్‌ ధర సేల్‌లో రూ.16,499కు తగ్గనుండగా.. ఆఫర్లతో మరో రూ.2500 తగ్గింపు పొందవచ్చని సేల్‌ పేజీలో తెలిపింది.


రెడ్‌మీ నోట్10ఎస్‌ (Redmi Note 10S) పై కూడా ఆఫర్‌ ఉండనుంది. మరోవైపు యాపిల్ ఐఫోన్‌ ( iPhones )లపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇక రియల్‌మీ, మోటోరోలా, ఇన్ఫినిక్స్‌కు చెందిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ సంకేతాలు ఇచ్చింది.


మరోవైపు Mi 5X 4K Smart TVని ఆఫర్లతో రూ.28,499కే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తన సేల్‌ పేజీలో ఉంటుంది. ఈ టీవీ సాధారణంగా రూ.40,999 ధరతో ఉంటుంది. అలాగే మిగిలిన బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ACలపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa