ఆధార్ కార్డ్ లో ఏ లోపాలు లేకుండా చేసుకొవడం ఎంతో ముఖ్యం. మన దేశంలో ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం. గుర్తింపు దగ్గరి నుంచి ప్రభుత్వ పథకాలు పొందేందుకు కూడా ఆధార్ కావాల్సిందే. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆధార్‌తోనే చాలా సేవలు పొందే అవకాశం ఉంది. అయితే ఇంతటి ముఖ్యమైన ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేనీ కోసమైన అప్లై చేసే సమయాల్లో మీరు సమర్పించే వివరాలు, ఆధార్‌లోని వివరాలు సరిపోలకపోతే సమస్యగా మారుతుంది. అందుకే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వీలైనంత త్వరగా మార్చుకోవాలి. కొందరి ఆధార్ కార్డుల్లో చిరునామా (అడ్రస్) తప్పుగా ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారవచ్చు. అందుకే అప్‌డేట్ చేసుకోవాలి. ఆధార్ కరెక్షన్స్ కోసం ఆన్‍లైన్ సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే మీ కార్డులో అడ్రస్‌ను మార్చుకునే అవకాశం ఉంది. నిమిషాల్లోనే అడ్రస్ అప్‌డేట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎలానో చూడండి. ఆన్‌లైన్ ద్వారా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవాలంటే కింది స్టెప్స్ ఫాలో అవండి.
ఆధార్ కార్డులో ఆన్‌లైన్ ద్వాారా అడ్రస్‌ను అప్‌డేట్/మార్పు చేసుకోండి ఇలా..
ముందుగా బ్రౌజర్‌లో ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
అనంతరం మొదట్లోనే ఉండే మై ఆధార్ (My Aadhaar) సెక్షన్‌పై క్రజర్ ఉంచితే.. డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది.
మై ఆధార్ సెక్షన్‌లో అప్‌డేట్ యువర్ ఆధార్ (Update Your Aadhaar) ఆప్షన్‌లో అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా & చెక్ స్టేటస్ (Update Demographic data & Check Status) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అనంతం లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే పేజీలో ఆధార్ నంబర్, అక్కడే ఉండే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
అవి ఎంటర్ చేశాక ఆధార్‌కు రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆరు అంకెల ఓటీపీ టైప్ చేసి ఎంటర్‌పై క్లిక్ చేయాలి.
అనంతరం అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఓపెన్ అయ్యే వెబ్‌పేజీలో అడ్రస్ (Address) ఆప్షన్‌ను ఎంచుకొని.. ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్ (Proceed to Update Aadhaar ) బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత కార్డులో ప్రస్తుతం ఉన్న అడ్రస్ కనిపిస్తుంది. కింద ఉన్న ఖాళీల్లో మీరు ఏ అడ్రస్ మార్చాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అన్ని వివరాలను సరిగా నమోదు చేయాలి.
చివర్లో మీరు మార్చాలనుకుంటున్న అడ్రస్ ఉన్న ధ్రువీకరణ పత్రాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. విద్యుత్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆస్తిపన్ను రశీదు, వాటర్ బిల్ లాంటివి చిరునామా మార్పు కోసం అప్‌లోడ్ చేయవచ్చు.
ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి, సబ్మిట్ చేయాలి.
అంతే చిరునామా మార్పుకు దరఖాస్తు పూర్తవుతుంది.
మీరు ఆధార్‌లో ఏ మార్పు చేశారో ప్రివ్యూ చూడవచ్చు. మీ దరఖాస్తుకు URN నంబర్ కూడా వస్తుంది. దాని ద్వారా ఆధార్ అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అన్ని సరిగా సమర్పిస్తే దాదాపు రెండు వారాల్లోనే మీ ఆధార్‌లో చిరునామా మారిపోతుంది.
ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఆధార్ చిరునామా మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. దరఖాస్తులో వివరాలు రాసి, ఇవ్వాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa