పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు సమీపిస్తోంది. మార్చి 31 పాన్ ఆధార్ లింక్ కు చివరి తేదీగా ఉంది. ఆ తర్వాత కూడా అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు. రూ.10వేల వరకు జరిమానా కట్టి మళ్లీ పాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే PAN - Aadhaar అనుసంధానం తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతానికి ఈ ఏడాది మార్చి 31 ఆఖరు తేదీగా ఉంది. ప్రభుత్వం మరోసారి తుదిగడువు పొడిగిస్తుందో లేదో స్పష్టత లేదు. అందుకే ఇంతవరకు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోని వారు.. ఎంత వీలైతే అంత త్వరగా చేసుకుంటే మంచిది. పాన్ కార్డుకు ఆధార్‌ను క్షణాల్లో అనుసంధానం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఎస్ఎంఎస్ పద్ధతిలోనూ లింక్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి.
పాన్‌కు ఆధార్ లింక్ చేసుకోండిలా..
ముందుగా వైబ్ బ్రౌజర్‌లో ట్యాక్స్ ఈ-ఫిల్లింగ్ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం క్విక్ లింక్స్ అనే సెక్షన్‌లో లింక్ ఆధార్ (Link Aadhar) అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదా అవర్ సర్వీసెస్ ట్యాబ్‌లోనూ ఉంటుంది.
లింక్ ఆధార్‌పై క్లిక్ చేశాక పాన్ (PAN) నంబర్, ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత నిబంధనలను అంగీకరిస్తున్నట్టు బాక్స్‌లో టిక్ చేయాలి. అనంతరం కింద ఉండే లింక్ ఆధార్ బటన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ పాన్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ క్లిక్ చేస్తే పాన్ - ఆధార్ లింక్ పూర్తవుతుంది.
మరో విధానం
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో మరో విధానం ద్వారా కూడా పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. అయితే పై పద్ధతిలో పోలిస్తే ఇది కొంచెం సుదీర్ఘ ప్రక్రియగా ఉంటుంది.
ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
వెబ్‌పేజీ పై ఎడమ భాగంలో ఉండే రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
మీ పాన్ నంబర్ యూజర్ ఐడీగా ఉంటుంది.
యూజర్ ఐడీగా మీ పాన్ నంబర్ ఎంటర్ చేశాక కంటిన్యూపై క్లిక్ చేసి.. మిగిలిన వివరాలు సమర్పించి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
అనంతరం లాగిన్ అయ్యేందుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
లాగిన్ అయ్యాక పాన్‌కు ఆధార్ లింక్ కోసం ఓ పాప్అప్ విండో ఓపెన్ అవుతుంది.
ఒకవేళ పాప్అప్ విండో రాకపోతే.. మెనూబార్‌లోని ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.
పాన్ వివరాల ప్రకారం పేరు, డేట్ ఆఫ్ బర్త్ అక్కడ కనిపిస్తాయి. పాన్, ఆధార్ కార్డు సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలి.
అన్ని సరిగ్గా మ్యాచ్ అయితే ఆ తర్వాత లింక్ నౌ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత పాన్ కార్డుకు ఆధార్ విజయవంతంగా లింక్ అయిందనే పాప్‌అప్ వస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా..
మీ ఆధార్, పాన్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు.
ముందుగా మీ మొబైల్‌లో UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డు నంబర్ టైప్ చేయాలి.
ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161 నంబర్‌కు సెండ్ చేయాలి. అంతే పాన్‌కు ఆధార్ లింక్ అవుతుంది.
ఉదాహణకు.. మీ ఆధార్ నంబర్ 012345678901, పాన్ సంఖ్య ABCDE1111A అయితే..
UIDPAN 012345678901 ABCDE1111A అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి.
పాన్ కార్డుతో ఆధార్ అనుధానం కోసం ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆధార్, పాన్ కార్డు.. రెండింటిలో వివరాలు సరిపోలితేనే అనుసంధానం అవుతుంది. ఒకవేళ పేరు, పుట్టిన తేదీ వివరాలు విభిన్నంగా ఉంటే లింక్ కాదు. అందుకే వివరాలు మ్యాచ్ కాకపోతే.. సవరణ చేయించుకొని.. అనుసంధానం చేసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa