ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలానికి భారీ విస్కీ బాటిల్‌

international |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 04:50 PM

విస్కీ బాటిల్ మనిషి చేతితో పట్టుకునేలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనిషికన్నా చాలా పొడవుగా ఉంది. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ ఈ భారీ స్కాచ్‌ విస్కీ బాటిల్‌ను రూపొందించింది. ది ఇంట్రెపిడ్‌గా గుర్తింపు పొందిన ఈ బాటిల్‌ ఐదు అడుగుల 11 అంగులాల పొడవు ఉండటంతో అందరూ దీనిని చూడటానికి క్యూ కడుతున్నారు.


స్కాట్‌ల్యాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్‌ హౌజ్‌.. లైఆన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ వేలంపాట ద్వారా ఈ బాటిల్ ను విక్రయించనుంది. మే 25వ తేదీన వేలం పాటను నిర్వహించనుంది. ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఒక విస్కీబాటిల్‌ అత్యధికంగా 1.9 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే అమ్ముడుపోగా ఇప్పుడు ఆ రికార్డును ది ఇంట్రెపిడ్‌ బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa