సీఎం జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నో కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందన్నారు. ఒక్క ఏప్రిల్‌లోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగాయన్నారు. గత నెలలో 26 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa