తన అరెస్టుకు PMO కుట్ర పన్నిందని ఇటీవల విడుదలైన గుజరాత్ స్వతంత్ర్య ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని ఆరోపించారు. దీనిని ‘56 అంగుళాల పిరికిపంద చర్య’గా అభివర్ణించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే 56 అంగుళాల ఛాతీ ఉండాలంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి ఇలా కౌంటర్ వేశారు. గుజరాత్లో పట్టుబడిన రూ.1.75 లక్షల కోట్ల డ్రగ్స్, 22 పరీక్ష పత్రాల లీక్‌కు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.