ప్రపంచంలో అనేక దేశాల్లో రకరకాల ఆనవాయితీలు ఉంటాయి. అయితే బట్టలు లేకుండా తిరిగే ఆనవాయితీ కూడా ఓ నగరంలో ఉంది. అదెక్కడో కాదు అభివృద్ధిలో ముందున్న ఫ్రాన్స్ దేశంలో ఈ ఆనవాయితీ ఉంది. ఈ దేశంలోని కేప్డీ ఆగ్డే అనే పట్టణంలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆనవాయితీ ఉంది. ఇక్కడ ఎవ్వరైనా సరే బట్టలు లేకుండానే తిరగాలి. ఇదే ఇక్కడి ఆనవాయితీ. ప్రపంచంలోని అతి పెద్ద నగ్న నగరంగా దీనికి పేరుంది.
ఈ నగరంలో బీచుల్లో, వీధుల్లో, షాపింగ్ మాల్స్ లో కూడా అందరూ నగ్నంగా తిరుగుతుంటారు. ఈ ఆచారం చూసి ఇక్కడికొచ్చిన టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఒక వేళ ఎవరైనా బట్టలు వేసుకుని కనిపిస్తే అక్కడి అధికారులు వారి చేత బలవంతంగా బట్టలను విప్పించేస్తున్నారు. ఇదెక్కడి ఆనవాయితీరా స్వామీ అంటూ టూరిస్టులు నెత్తిన బాదుకుంటున్నారు. ఇటువంటి వింత ఆచారాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.