దేశంలో బొగ్గు కొరతపై కేంద్రహోంమంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. బొగ్గు కొరత కారణంగా 12 రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కరెంట్ కోతలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.