ప్రకాశం జిల్లా రిమ్స్‌లో రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. రైల్వేస్టేషన్లలో జరుగుతున్న ఘటనలను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుందన్నారు. 'రేపల్లె ఘటనలో రైల్వే అధికారులను నివేదిక కోరాం. రాత్రి సమయాల్లో ప్రయాణికుల సెక్యూరిటీ విషయంలో రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం' అని ఆమె స్పష్టం చేశారు.