రాజకీయ సంక్షోభంతో ఇటీవల గద్దె దిగిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. దీంతో త్వరలోనే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇమ్రాన్ సౌదీ అరేబియాలో ఈద్ ప్రార్థనల్లో ఉండగా.. అది ముగియగానే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.