యుఎస్ అధ్యక్షుడు బైడెన్ పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వెటకారం చేశాడు. వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ ట్రెవోర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ‘ట్రెవోర్.. మీకొక శుభవార్త. మీరు యుఎస్ అధ్యక్షుడిని నిరభ్యంతరంగా విమర్శించొచ్చు. మాస్కోలోలాగా మిమ్మల్నేం అరెస్ట్ చేయబోం’ అంటూ బైడెన్ చమత్కరించాడు. రష్యాలో పుతిన్‌ను విమర్శిస్తే జైలులో వేస్తారనే ఆరోపణలున్నాయి.