వేసవిలో ఉక్కపోతలు ఎక్కువ. అందుకే ఏప్రిల్ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే 13.6 శాతం మేర పెరుగుదలతో 132.98 బిలియన్ యూనిట్లకు చేరిందని విద్యుత్ శాఖ తెలిపింది.
వేసవి ప్రభావం ఈ ఏడాది ముందుగానే మొదలవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని విద్యుత్ శాఖ తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో 117.08 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ ఏడాది గరిష్ఠంగా విద్యుత్ వాడకం ఏప్రిల్‌లో 207.11 గిగా వాట్స్‌గా నమోదైంది. అంతకుముందు ఏడాది ఏప్రిల్ 2021లో 182.37 గిగావాట్లు, ఏప్రిల్ 2020లో 132.73 గిగావాట్లుగా నమోదైంది.