మెలిందాతో వైవాహిక జీవితం అద్భుతంగా సాగిందని, అవకాశం వస్తే మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని అన్నారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్. అందులో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, విడాకులు, కరోనా కంటే పిల్లలు తనను వదిలి వెళ్లడమే అత్యంత బాధ కలిగించిందన్నారు. కాగా మెలిందా కోరిక మేరకు గతేడాది ఆగస్టులో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.