అధికార బలంతో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.